calender_icon.png 14 July, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ దూరదృష్టితోనే నేడు అద్భుత ఫలితాలు

14-07-2025 02:04:05 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): కేసీఆర్ దూరదృష్టి ఫలి తంగా రెండు అద్భుత ఫలితాలను తెలంగాణ ఇవాళ సాధించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేస్తూ కేసీఆర్ విజన్‌కు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా జెక్ట్ జీవన సాక్ష్యమన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మోటా ర్లు ఆన్ అవడంతో ఖమ్మం జిల్లాలో ని ప్రతి ఎకరం వ్యవసాయ భూమికి సాగునీరు అందుతోందన్నారు.

మరో అద్భుతం యాదాద్రి థర్మల్ ప్లాం ట్ అని, దామరచర్ల అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్ వన్ 72 గంటల కోడ్ (సీఓడీ)ను విజయవంతంగా పూర్తి చేసిందని కేటీఆర్ చెప్పారు. పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని, అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు ఏమాత్రం కాదని అన్నారు. త మ నాయకుడు కేసీఆర్ పాలన, విజ న్ మా అందరికీ గర్వకారణమన్నారు.