calender_icon.png 17 July, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు

14-07-2025 09:24:39 AM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్(Special Investigation Team) విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం ప్రధాన నిందితుడు, మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (Special Intelligence Branch) చీఫ్ టి. ప్రభాకర్ రావును మరోసారి విచారించనుంది.. బాధితుల స్టేట్ మెంట్ ఆధారంగా మరోసారి ప్రభాకర్(T Prabhakar Rao) రావును విచారించనున్నారు. గతంలో ప్రభాకర్ రావు ల్యాప్ టాప్, ఫోన్ ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ప్రభాకర్ రావు ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ను సిట్ ఎఫ్ఎస్ఎల్ కు పంపింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావును మరోసారి సిట్ ప్రశ్నించనుంది.