calender_icon.png 14 July, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీన్మార్ మల్లన్న నాపై దారుణంగా మాట్లాడారు

13-07-2025 04:16:51 PM

హైదరాబాద్: మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఆదివారం జరిగిన దాడిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తను తీన్మార్ మల్లన్న దారుణంగా మాట్లాడారని ఆరోపించారు. తెలంగాణ మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంటుందని, మల్లన్నను ఒకసారి కూడా విమర్శించలేదన్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించామని తెలిపారు. ప్రజాస్వామ్యంగా మాట్లాడేందుకు వస్తే... కాల్పులు జరుపుతారా..?, ఒక మహిళ ప్రశ్నిస్తే తట్టుకోలేరా..? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను అరెస్టు చేయకుంటే.. సీఎం రేవంత్ రెడ్డిని కూడా అనుమానించాల్సి వస్తోందని ఆమె హెచ్చరించారు. మల్లన్న చేసిన వ్యాఖ్యాలపై మహిళా కమిషన్ ను కలుస్తానన్నారు. అలాగే, తీన్నార్ మల్లన్నపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికు ఫిర్యాదు చేశానని, విచక్షణాధికారాలు ఉపయోగించి మండలి ఛైర్మన్ సస్పెండ్ చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీకే ఈ పరిస్థితి ఉంటే.. సాధారణ మహిళల పరిస్థితేంటి..? అని ప్రశ్నించారు.