14-07-2025 01:06:43 AM
ఇరుకుగా మారిన రహదారి
మహబూబాబాద్, జులై 12 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం పట్టణంలో పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ వరకు 100 అడుగుల ఆర్ అండ్ బి రోడ్డు పక్కన విద్యుత్ శాఖ గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాల్లో కొన్నింటిని పలుచోట్ల తొలగించి రోడ్డు మధ్యకు మార్చడంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారింది.
పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి జ్యోతిబాపూలే సర్కిల్ వరకు మధ్యలో ఉన్న ఆర్‌ఓబి కి ఇరువైపులా 100 అడుగుల రోడ్డు విస్తరణ కోసం 2010 లో భూనిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి అవసరమైన భూమిని సేకరించారు. అనంతరం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తో పాటు డాంబర్ రోడ్డు, హైమాస్ లైట్లు, బ్రిడ్జికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు వేశారు. అయితే ఇప్పుడు బ్రిడ్జికి ఇరువైపులా 100 అడుగుల రోడ్డు ఆక్రమణలతో 30 అడుగులకు కుంచించుకు పోయింది.
దీనికి తోడు 100 అడుగుల బౌండరీ వద్ద వేసిన విద్యుత్తు లైన్లను తొలగించి ముందుకు జరిపి రోడ్డు వెంట వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం 100 అడుగులు ఉండాల్సిన రోడ్డు ఆక్రమణలకు గురై ముప్పు అడుగులకు తగ్గిపోయింది. నిబంధనల ప్రకారం గతంలో ఆర్ అండ్ బి శాఖ నుండి 100 అడుగుల రోడ్డుకు ఇరువైపులా చివరన విద్యుత్ లైన్లు వేయడానికి విద్యుత్ శాఖ కు డబ్బులు కూడా చెల్లించింది.
9.5 మీటర్ల పొడవాటి స్తంభాలను నాటి విద్యు త్తు లైన్లు వేశారు. అయితే కొందరు విద్యుత్ అధికారులకు చేతులు తడిపి కొంద రు తమ ఇండ్ల ముందు ఉన్న విద్యుత్తు స్తంభాలను తొలగించి పది అడుగుల దూరం లో రోడ్డుపైన వేయించినట్లు విమర్శలు వస్తున్నా యి. అలాగే వ్యాపార సంస్థలకు సం బంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సైతం రోడ్డుపైనే పబ్లిక్ ప్లేసులో వేయించడం వల్ల విద్యుత్తు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, రోడ్డుపై రాకపోకలకు ఆటంకంగా మారిందని ప్రజ లు ఆరోపిస్తున్నారు.
విద్యుత్తు లైన్లను ముందుకు జరపడం వల్ల దాన్ని సాకుగా చేసుకొని కొందరు రోడ్లపై అక్రమ నిర్మాణాలు, గుంచీలు వేయడం వల్ల విశాలమైన100 అడుగుల రోడ్డు కాస్త ఇప్పుడు 30 అడుగులకు చేరగా, ఇరుకుగా మారిన రోడ్డుపై తరచూ ప్రమాదాలతో చేసుకొని విద్యుత్ స్తంభాలు దెబ్బతింటున్నాయని, ఫలితంగా పలుచోట్ల లక్షల రూపాయలు వెచ్చించి వేసిన హైమాస్ లైట్ స్తంభాలు నేల కూలుతున్నాయని విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా ఆర్‌అండ్‌బి అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, రోడ్లపై వేసిన విద్యుత్ స్తంభాలను తొలగించి యధావిధిగా రోడ్డు పక్కన ఏర్పాటు చేయాలని, 100 అడుగుల రోడ్డు వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు. తారు రోడ్డు వెంట ఉన్న హైమాస్ లైట్లను తొలగించి, 100 అడుగుల రోడ్డుపై మధ్యలో డివైడర్ నిర్మించి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేసి 100 అడుగుల రోడ్డును పూర్తిగా తారు రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.