8 June, 2026 | 2:44 AM

36 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక

08-06-2026 12:49 AM

నంగునూరు, జూన్ 7: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 1989-90 నాటి ప దో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. చదువు పూ ర్తయిన 36 ఏళ్ల తర్వాత మిత్రులంతా ఒకేచో ట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నా రు.

తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు లు ఎల్లంకి రామచంద్రరెడ్డి, మోహనపు ఆ నందయ్యలను విద్యార్థులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందించారు. ఈ కార్య క్రమంలో పూర్వ విద్యార్థులు బండోజు శ్రీనివాస్, గుగ్గిళ్ళ రవి, తిరుమణి సాయిరామ్, కందుకూరి సత్యం, తాటికొండ రవి, రాజిరెడ్డి, రహీమ్, కనకయ్య, సత్యనారాయణ రెడ్డి, వెంకటలక్ష్మి, వసంత, వరలక్ష్మి, విజయలక్ష్మి, సరోజ తదితరులు పాల్గొన్నారు.