8 June, 2026 | 2:46 AM

సీత రామచంద్రస్వామి తిరుకళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్

08-06-2026 12:48 AM

రామచంద్రాపురం, జూన్ 7 : రామచంద్రపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్, రాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.