బక్రీద్ తర్వాతి రోజు సెలవు ఇవ్వాలి
24-05-2026 12:00 AM
బక్రీద్ పండుగ మరుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలి. చాలా మంది ఆడపిల్లలు పండుగను ఇంట్లో చేసుకొని, మరుసటి రోజు పుట్టింటికి వస్తారు. చాలా ఇళ్లల్లో ఆడపిల్లలు ఇంటికి వచ్చినప్పుడే ఖుర్బానీ ఇస్తారు. ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. త్యాగానికి ప్రతీకగా చెప్పుకొనే ఈ పండుగ ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించాలి. పలు పండుగలకు మరుసటి రోజు ‘ఫాలోయింగ్ డే’గా సెలవు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రభుత్వం బక్రీద్ పండుగ మరుసటి రోజు ఫాలోయింగ్ డేగా సెలవు ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలి.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్






