calender_icon.png 18 September, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురువులపై గురుతర బాధ్యత

18-09-2025 12:00:00 AM

నిర్మల్, సెప్టెంబర్ (విజయక్రాంతి): ఈ సమాజమైన అభివృద్ధి చెందాలన ఆ సమాజంలో గురువులపై ఎంతో బాధ్యత ఉంటుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన 106 ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అవార్డు అందజేసి సన్మానం చేశారు.

గురుపూజోత్సవాన్ని నిర్వహించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లాలో విద్యా ప్రమాణాలు అభివృద్ధికి ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు విద్యుత్ తో పాటు క్రమశిక్షణ దేశభక్తి నేర్పించాలని ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో నిర్మల్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు తెచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు