21 August, 2026 | 10:25 AM

జైల్లో కవితతో కేటీఆర్ ములాఖత్

14-06-2024 01:37 PM

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ములాఖత్ అయ్యారు. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగి ప్రయాణం అయ్యారు. ఈ భేటీలో ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంచలనం రేపిన దిల్లీ మద్యం కేసులో కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పెంచిన సంగతి తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో జూన్ 21 వరకు కవితకు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.