15 August, 2026 | 2:42 AM

కుదువ పెట్టుకున్న ఇంటిపై లోన్

25-05-2024 12:46 AM

చీటింగ్ కేసు నమోదు 

రాజన్న సిరిసిల్ల, మే 24 (విజయక్రాంతి): అవసరానికి డబ్బులు ఇచ్చి, ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆ తర్వాత ఇంటి పేపర్స్‌తో బ్యాంకులో రుణం తీసుకొని మోసానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదయింది. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని సంజీవయ్య నగర్‌కు చెందిన రాకం పెద్దబాబు తన అవసరం నిమిత్తం రాగుల రాములు అనే వ్యక్తి వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇందుకోసం తన ఇంటిని రాములుకు రిజిస్ట్రేషన్ చేశాడు. రాములు ఓ బ్యాంక్‌లో ఆ ఇల్లు కాగితాలతో రూ. 20 లక్షల లోన్ తీసుకున్నాడు. అప్పు తీసుకున్న పెద్దబాబు వడ్డీతో కలిపి చెల్లించినప్పటికీ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా రాములు కాలం గడుపుతున్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయిం చడంతో అతడిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.