23 March, 2026 | 4:59 AM

ఆ క్రికెటర్లంటే ఎంతో గౌరవం

26-08-2024 12:30 AM

ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్

న్యూఢిల్లీ: భారత స్టార్‌గా మారిన ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ తనకు ఇష్టమైన ముగ్గురు ఇండియన్ క్రికెట్ల పేర్లు చెప్పింది. వారితో ఒక్క గంట సేపు సమ యం వెచ్చించినా సరిపోతుందని పేర్కొంది. మనూ మాట్లాడుతూ.. ‘భారత్‌లో సచిన్, ధోనీ, కోహ్లీ అంటే చాలా ఇష్టం. వారితో ఒక్క గంట సమయం వెచ్చించినా, కాసేపు మాట్లాడినా ఎంతో గౌరవంగా ఉంటుంది. వారు ఎంతో స్ఫూర్తినిస్తారు’ అని తెలిపింది.