23 March, 2026 | 12:03 AM

శిఖర్ లెక్కలేనన్ని జ్ఞాపకాలు అందించావ్

26-08-2024 12:30 AM

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ధావన్‌ను మెచ్చుకుంటూ అనేకమంది మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో తమ స్పందనలు తెలియజేయగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా శిఖర్‌తో తనకున్న అనుభవాన్ని పంచుకున్నాడు. ఎక్స్‌లో ఒక నోట్‌ను షేర్ చేస్తూ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ‘శిఖర్ నీవు ఆరంగ్రేటం చేసిన నుంచి మాకు ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు. ఆటపై నీకున్న మక్కవ, నీ క్రీడాస్ఫూర్తి, నీ చిరునవ్వును మేము తప్పకుండా మిస్ అవుతాం. మరపురాని ఎన్నో ప్రదర్శనలు, తీయటి జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆఫ్ ది ఫీల్డ్‌లో నీవు మొదలు పెట్టబోయే సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆల్ ది బెస్ట్’ అంటూ కోహ్లీ రాసుకొచ్చాడు.