13 July, 2026 | 2:45 AM

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఫంకీ

12-12-2024 12:00 AM

విశ్వక్సేన్, అనుదీప్ కె.వి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఫంకీ‘. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత ఎస్. నాగవంశీ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రేమ గుర్తులతో ‘ఫంకీ’ టైటిల్ ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. 2025 సంక్రాంతి తర్వాత ఫంకీ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.