calender_icon.png 1 August, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్నాకు భారీగా తరలి రావాలి

31-07-2025 12:00:00 AM

రాజన్న సిరిసిల్ల: జూలై 30(విజయక్రాంతి) ఈనెల 5వ తేదీ నుండి 7న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే బీసీ ధర్నా కోసం కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఓ బి సి ఎంపీల పోరం కన్వీనర్ విహెచ్ హనుమంతరావు కోరారు. బుధవారం ఆయన సిరిసిల్లలో ఆకస్మికంగా పర్యటించారు.

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లు వేసిన అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ జోడోయాత్ర ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలిసారని అన్నారు. బిసి కుల గణన చేయాలని కోరారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 42 శా తం బిసి రిజర్వేషన్లు అమలు కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారని అన్నారు. కార్యక్రమంలో నాగుల సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.