calender_icon.png 2 August, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

31-07-2025 12:00:00 AM

కామారెడ్డి, జూలై 30 (విజయ క్రాంతి), ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ అభియాన్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సుభాష్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టబడ్డాయని తెలిపారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ అభియాన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పాత జ్ఞానేశ్వరి,మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోనిలక్ష్మీ రాజా గౌడ్, బిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, భిక్కనూర్ మాజీ ఎంపీపీ సుదర్శన్, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోమకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.