calender_icon.png 31 July, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమునిపాదంలో పర్యాటకుల సందడి

29-07-2025 12:20:26 AM

మహబూబాబాద్, విజయక్రాంతి : మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో భీముని పాదం జలపాతం పర్యాటకులతో సందడిగా మారింది. రెండు రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలతో భీముని పాదం జలపాతం 20 అడుగుల ఎత్తు పై నుండి పాలధారలా దిగువకు జాలువారు తోంది. ఇతర జలపాతాలకు సందర్శకులను అనుమతించకపోవడంతో పర్యాటకులంతా భీముని పాదం జలపాతం వైపు దారిమల్లారు. దీనితో భీముని పాదం జలపాతం పర్యాటకులతో కళకళలాడింది. జలపాతం లో సందర్శకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ, పైనుండి జాలువారుతున్న నీటి కెరటాల్లో కేరింతలతో జల సవ్వడులను ఆస్వాదించారు.