3 September, 2026 | 5:21 AM

గుర్తుండిపోయేలా ‘డియర్ హార్ట్’

03-09-2026 | 02:40am

లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి , సుప్రియా చవాన్ ప్రధాన పాత్రలుగా జీడీ నరసింహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ హార్ట్’(Dear Heart). సౌజన్య నిర్మాత. ఈ సినిమాలో సురేశ్ గురు, పృథ్వీరాజ్, సత్యప్రకాశ్, జబర్దస్త్ నూకరాజు, జగదీశ్వరి ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ మూవీ మోస్టర్ పోస్టర్‌ను సాయిరాజేశ్ రిలీజ్ చేశారు.

‘కొన్ని ప్రేమ కథలు కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి.. కానీ కొన్ని కథలు కాలం ఉన్నంత వరకు గుర్తుంటాయి.. నిజమైన ఏ ప్రేమ అయినా చరిత్రలో అలా గుర్తుండిపోవాల్సిందే.. మన ప్రేమలా’ అంటూ సాగిందీ మోషన్ పోస్టర్. ఈ సినిమాకు అరవింద్ బీ కెమెరామెన్‌గా, ఎస్ సుహాస్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.