3 September, 2026 | 5:21 AM

కాలాన్ని దాటి జీవించే లెజెండ్ ‘దేవరాయ’

03-09-2026 | 02:45am

కిచ్చా సుదీప్ ప్రస్తుతం ఒక పీరియడ్ చిత్రంలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై(People Media Factory) ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోపై ప్రియ సుదీప్ సమర్పిస్తున్నారు. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను ‘దేవరాయ’గా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా మేకర్స్  శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్‌ను మజెస్టిక్ అవతార్‌లో పరిచయం చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమా ప్రపంచాన్ని అద్భుతంగా పరిచయం చేస్తోంది.

చరిత్రను మలిచిన సామ్రాజ్యం. ఒక యుగాన్ని నిర్వచించిన రాజు. కాలాన్ని దాటి జీవించే ఒక లెజెండ్. అనే మూడు శక్తిమంతమైన ఆలోచనలతో మేకర్స్ ‘దేవరాయ’ను పరిచయం చేశారు. శ్రీకృష్ణదేవరాయ ప్రాధాన్యతను ఈ మాటలు చక్కగా ప్రతిబింబిస్తున్నాయి.

తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రల్లో ఇంటెన్సిటీని చూపించే నటుడిగా గుర్తింపు పొందిన సుదీప్.. ఈ పాత్ర కోసం మజెస్టిక్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. 2027 డిసెంబర్‌లో ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. గౌర హరి కే సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు, నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలను నిర్మాతలు త్వరలో ప్రకటించనున్నారు.