3 September, 2026 | 5:21 AM

ప్రభాస్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు

03-09-2026 | 02:40am

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి (Director Venugopal Reddy) రూపొందిస్తున్నారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఈ నెల 3న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను బుధవారం జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. “మా మూవీ కోసం ప్రభాస్‌నున కలవడం చాలా హ్యాపీగా అనిపించింది.

నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది.  ప్రభాస్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది.  తెలంగాణ నేపథ్యంతో ‘మేమ్ ఫేమస్’ అనే సినిమా చేశా. ఇక్కడి ప్రేక్షకులు బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో ‘గోదారిగట్టుపైన’ సినిమా చేశా. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ ‘రోమాంచకం’ సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. ఇంజినీరింగ్ పూర్తిచేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు.

ఆ క్యారెక్టర్ క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. నేను హీరోగా రెండు సినిమాలు చేసినా డైరెక్టర్ వేణుగోపాల్.. ఈ క్యారెక్టర్‌కు తగినట్టు మార్చుకునేందుకు నాతో ఆర్నెళ్లు వర్క్‌షాప్స్ చేయించారు. ఈ క్యారెక్టర్‌లో ఎలా నటించాల నాకూ ఐడియా ఉంది. కానీ వర్క్‌షాప్స్ అంతా కంప్లీట్ అయ్యాక నా పర్‌ఫార్మ్ చూసుకుంటే ఎంతో మార్పు కనిపించింది. కొన్నిసార్లు ఒకే సీన్ రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయి.

‘రోమాంచకం’ టైటిల్ కొత్తగా ఉంది.. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా అనిపించింది. కానీ, ఇప్పుడు అదొక ఊతపదంలా మారిపోతోంది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా మందికి ఈ పదం వాడుకలోకి వస్తుందని నమ్ముతున్నా. అనంతిక టాలెంటెడ్ యాక్ట్రెస్. ఆమెకు చాలా ఆర్ట్ ఫామ్స్ తెలుసు.

ఏ విద్యనైనా తక్కువ టైమ్‌లో నేర్చుకుంటుంది. ఆమెతో కలిసి ఈ సినిమాలో పనిచేయడం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.  మా సినిమా ఆద్యంతం రోమాంచకం ఫీల్‌ను ప్రేక్షకులకు కలిగిస్తుంటుంది.  - హీరోగా అన్నిరకాల చిత్రాల్లో నటించాలని ఉంది. ఇప్పుడు లవ్‌స్టోరీస్ వస్తున్నాయి. హీరోగా పేరొచ్చాక యాక్షన్, కమర్షియల్ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. నెక్స్ ఏషియన్ బ్యానర్‌లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్ సాయిలు కంపాటితో ఒక సినిమా చేయబోతున్నా. ఈ నెలలోనే ఆ సినిమా ప్రారంభం కానుంది.