18 July, 2026 | 5:03 AM

ఫేషియల్ రికగ్నిషన్‌లో నూతన విధానం

02-07-2024 06:26 AM
  • శానిటేషన్ విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
  • నేటి నుంచి మిడ్ అటెండెన్స్ అమలు

జీహెచ్‌ఎంసీ శానిటేషన్ విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 18 వేలకు పైగా ఉన్న శానిటేషన్ సిబ్బంది అటెండెన్స్ వ్యవహారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆధార్ బయోమెట్రిక్ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా శానిటేషన్ సిబ్బంది హాజరును నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా ఖర్చుల విషయంలోనూ పొదుపు చేస్తున్నట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ ఇటీవల ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో కూడా సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో అక్రమంగా అటెండెన్స్ నమోదైనట్టుగా అధికారులు గుర్తించారు. 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ శానిటేషన్ విభా గంలో అక్రమ అటెండెన్స్‌కు యత్నించిన వారి వివరాలను అధికారులు కనిపెట్టలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో అక్రమ అటెండెన్స్ నమోదుకు యత్నించి ఫెయిల్ వారిని అధికారులు కనుగొన్నారు. ప్రస్తుతం వీరిని విచారించే పనిలో ఉంటూనే.. మరోవైపు అక్రమంగా అటెండెన్స్‌కు యత్నించి సక్సెస్ అయిన (దాదాపు 80 అటెంప్ట్స్) వారిని కనిపెట్టేందుకు ఐటీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 

సర్వర్ డౌన్‌తో ఇబ్బందులు... 

ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారానూ బోగస్ అటెండెన్స్‌కు ప్రయత్నం జరిగిన నేపథ్యంలో శానిటేషన్ సిబ్బంది విషయంలో అధికారులు మరింత పటిష్ట చర్యలకు శ్రీకా రం చుట్టారు. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో 18 వేల మంది శానిటేషన్ సిబ్బంది విధుల్లో నిర్వహిస్తున్నారు. వీరు ప్రస్తుతం ఇన్, అవు ట్ పద్ధతిలో అటెండెన్స్  నమోదు చేస్తున్నారు. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య ఒకసారి, డ్యూటీ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 వరకు ఇంకోసారి అటెండెన్స్ నమోదు చేస్తున్నారు.

అయితే, ప్రస్తుతం సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లోనూ సమస్యలు ఉత్పన్నం కావడంతో మిడ్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావించారు. ప్రస్తుతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఉదయం (ఇన్), మధ్యాహ్నం (అవుట్) మాత్రమే అటెండెన్స్ నమోదవుతున్న నేపథ్యంలో.. ఒకవేళ అటెండెన్స్ వేసి పని నుంచి వెళ్లిపోయి తర్వాత అవుట్ సమయానికి వచ్చేవారిని గుర్తించడానికి మిడ్ అటెండెన్స్ పద్ధతి కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. 

నేటి నుంచి మిడ్ అటెండెన్స్.. 

శానిటేషన్ సిబ్బందికి ప్రతి నెలా ఆధార్ బయోమెట్రిక్ సమయంలో రూ. 33.5 కోట్లను చెల్లించేవారు. కానీ ఫేషియల్ రికగ్నిషన్‌తో రూ. 31 కోట్లను మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే ఫేషియ ల్ రికగ్నిషన్ వలన జీహెచ్‌ఎంసీ ప్రతినెలా రూ.2.5 కోట్లను ఆదా చేస్తుంది. అటెండెన్స్ అక్రమాలను అరికట్టేందుకు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా.. అక్రమార్కులు చేస్తున్న ప్రయత్నాలు జీహెచ్ ఎంసీ అధికారులకు సవాల్‌గా నిలుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అమలు చేస్తు న్న ఇన్, అవుట్ అటెండెన్స్‌తో పాటు మరోసారి అటెండెన్స్ తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

అయితే, ఈ అటెండెన్స్ ఉదయం 10.30 నుంచి 11 గంటల సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఒకవేళ అక్రమంగా అటెండెన్స్ వేసే వాళ్లు ఉదయం ఇన్ వేసి వెళ్లినట్టయితే మిడ్ అటెండెన్స్‌లో దొరికిపోయే ఛాన్స్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా అక్కడి జాబితాలోని ఏ ఇద్దరి సిబ్బందిని అయినా సరే అటెండెన్స్ కావాలని ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అడిగేలా ఈ విధానం రూపొందించినట్టు అధికారు లు తెలియజేస్తున్నారు. ఈ విధానాన్ని జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా నేటి నుంచి అమలు చేయబోతున్నట్టు అడిషనల్ కమిషనర్ స్నేహా శబరీష్ తెలిపారు.