calender_icon.png 18 September, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య భర్తల గొడవలతో మనస్థాపం చెంది భార్య అదృశ్యం

18-09-2025 07:58:17 PM

మేడిపల్లి (విజయక్రాంతి): భార్యా భర్తల గొడవలతో మనస్థాపం చెంది భార్య అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో నివసించే పర్వతాలు తన భార్య అయిన బాలనాగమ్మ(38) వీరిద్దరి మధ్య చిన్న గొడవల కారణంగా మనస్థాపం చెంది ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి రాలేదు, ఎక్కడ వెతికిన కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశాడు. భర్త ఇచ్చిన ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎవరికైనా బాలనాగమ్మ ఆచూకీ తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.