18 July, 2026 | 4:21 AM

అల్జీమర్స్‌కు కొత్త మందు

15-06-2024 01:37 AM

న్యూఢిల్లీ, జూన్ 14: వృద్ధాప్యంలో తీవ్రంగా వేధించే మతిమరు పు (అల్జీమర్స్) వ్యాధిని సమర్ధంగా నిరోధించే కొత్త ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఎలీ లిల్లీ అనే సంస్థ అభివృద్ధి చేసిన డొననేమాబ్ అనే ఈ ఔషధాన్ని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అల్జీమర్స్ ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు ఈ ఔషధం సమర్థంగా పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఔషధాన్ని 622 మంది రోగులపై ప్రయోగించి చూడగా 60 నుంచి 80 శాతం సత్ఫలితాలు ఇచ్చిందని వెల్లడించింది. అల్జీమర్స్ బాధితులు క్రమంగా జ్ఞాపక శక్తిని కోల్పోతుంటా రు. వ్యాధి ముదిరేకొద్ది సంభాషించటంలో సమస్యలు ఎదుర్కొంటారు. మాటల కోసం తడుముకోవాల్సి వస్తుంది. చివరకు తమనుతామే మర్చిపోతారు.