‘జో’ దర్శకుడితో..
17-04-2026 12:00 AM
‘జో’ మూవీ ఫేమ్ హరిహరన్ రామ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూ నివర్స్ పిక్చర్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మించ నున్నాయి. జీవీ ప్రకాశ్ ఈ ప్రాజెక్టులో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా సంగీతం కూడా అందిస్తున్నారు.
ఇందులో ఆయన సరికొత్తగా కనిపించనున్నారు. ‘జో’ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాలవిక మనోజ్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా జూన్‌లో ప్రారంభం కానుంది. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఇతర వివరాలు మేకర్స్ తెలియజేయనున్నారు.






