7 May, 2026 | 2:10 AM

రొమాంటిక్ కామెడీ జానర్‌లో కొత్త సినిమా

07-05-2026 01:08 AM

రోహిత్ నారా కొత్త సినిమా ప్రకటించారు. కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీతో తన తదుపరి ప్రాజెక్టును చేయనున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆయన నటిస్తున్న 23 ఇది. కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టును భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు.

‘షౌటింగ్ సూన్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న అనౌన్స్‌మెంట్ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది. యువతతోపాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలను కలగలిపిన వినోదాత్మక కథతో ఈ సినిమా రాబోతోంది. చిత్ర నిర్మాతలు త్వరలోనే ముహూర్తం వేడుకతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. నటీనటులు, సాంకేతిక బృందం, రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ వివరాలు తర్వాత వెల్లడించనున్నారు.