7 May, 2026 | 2:10 AM

మా ఇంటి బంగారం మరింత ఆలస్యం

07-05-2026 01:11 AM

సమంత ‘మా ఇంటి బంగారం’తో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ నందినీరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు రాజ్ నిడిమోరు కథను అందించారు. సమంత తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై రూపొందించిన ఈ సినిమా మే 15న విడుదల కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా చిత్ర యూనిట్ విడుదలను వాయిదా వేసి నట్లు ప్రకటించింది. ఐపీఎల్ ప్రభావం ఈ సినిమాపై పడటమే ఇందుకు కారణం. ఇక ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.