14 March, 2026 | 2:48 AM

పోషకాహార పానీయ విభాగంలో కొత్త అడుగు

14-03-2026 01:28 AM

న్యూట్రీ+తో రస్నా వృద్ధి లక్ష్యం

న్యూ ఢిల్లీ, మార్చి 13: రస్నా వేసవి సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని రస్నా న్యూట్రీ+ అనే కొత్త పోషకాహార పానీయ కాన్సన్ట్రేట్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. సంప్రదా య రుచితో పాటు విటమిన్లు, ఖనిజాలు కలిగిన ఈ ఉత్పత్తి ద్వారా కంపెనీ 15 నుంచి 20 శాతం వార్షిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కాన్సన్ట్రేట్ మార్కెట్‌లో 70 శాతానికి పైగా వాటా కలిగిన రస్నా, సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ వ్యవస్థను మరింత బ లోపేతం చేస్తోంది. ఈ ఉత్పత్తి 32 గ్లాస్ ప్యాక్స్, ఇన్‌స్టా న్యూ ట్రీ+ 500 గ్రాముల ప్యాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

వీటిలో పిల్ల లకు ఆకర్షణీయంగా ఉండే ‘ప్రాంకీస్’ అనే టాయ్స్‌ను కూ డా అందిస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంపెయిన్‌కు నటి రకూల్ ప్రీత్‌సింగ్ బ్రాండ్ అం బాసడర్‌గా వ్యవహరిస్తుండగా, కంపెనీ చైర్మన్ పిరూజ్ ఖంబట్టా కుమారుడు అరీజ్ ఖంబాట్టా ప్రకటనలో కనిపిస్తున్నారు. కంపెనీ చైర్మన్ పిరూజ్ ఖం బాట్టా మాట్లాడుతూ, భారతీయ పండ్లతో తయారీ చేసి 60కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.రస్నా 2026 సమ్మ ర్ ప్రచారంలో భాగంగా ఇండియన్ ప్రీమియల్ లీగ్  మ్యాచ్‌ల సమయంలో, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, టెలివిజన్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేపడుతోంది.

రస్నా గురించి 

రస్నా ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 12 తయారీ యూనిట్లు, 26 డిపోలు, 200 సూపర్ స్టాకిస్టులు, 5,000 స్టాకిస్టులు, 900 సేల్స్ సిబ్బందితో 18 లక్షల రిటైల్ అవుట్లెట్లను కవర్ చేస్తోంది. ఐఎస్‌ఓ, హెచ్‌ఏసీసీపీ, హెచ్‌ఏఎల్‌ఏఎల్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికేషన్లు కలిగిన ఈ సంస్థ ప్రస్తుతం 60కిపైగా దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది.