యోగతోనే ఆరోగ్యంగా ఉంటాం
21-06-2026 01:25 PM
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పియంఆర్సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వర్చువల్ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ , ఐ టి డి ఏ పి ఓ మంద మకరందు ల తో పాటు ఐ టి డి అధికారులు పాల్గొన్నారు. ఆదివారం పి ఎమ్ ఆర్ సి లో ఏర్పాటుచేసిన యోగా ఆసనాలు వేశారు. ప్రతి రోజు యోగా, వ్యాయామం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగ ఆసనాలతో ఆరోగ్యంగా ఉంటామన్నారు.హెల్తీ గా ఉండడానికి ప్రతి ఒక్కరు యోగా, ఆసనాలు వేయాలని సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






