10 August, 2026 | 3:46 AM

కరీంనగర్‌లో పెరిక భవనం కావాలి

10-08-2026 12:00 AM

స్థలం కేటాయించండి

పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్‌కు వినతి

కరీంనగర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలో పెరిక భవన్ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించాలని పెరిక కుల నాయకులు పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం కరీంనగర్‌కు వచ్చిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్‌కు సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు.

పెరిక సంఘ భవనం నిర్మాణం కోసం 2 ఎకరాల భూమి కేటాయించాలన్న జిల్లా నేతల విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల చంద్రశేఖర ప్రధాన కార్యదర్శి బస్వ వెంకన్న, రాష్ట్ర సలహాదారు దొరిశెట్టి వెంకన్న, సలహాదారు మీస అర్జున్ రావు, కరీంనగర్ పట్టణ అధ్యక్షులు దాసరి అశోక్, ప్రధాన కార్యదర్శి బుద్ధె రామచంద్రం, రుక్మాపూర్ మాజీ సర్పం కర్రె శ్రీనివాస్, మాదన శేఖర్, గాండ్ల సంపత్, ముద్దసాని రంగన్న పాల్గొన్నారు.