బోనమెత్తిన భాగ్యనగరం
- అంబర్‌పేట్ మహంకాళి సన్నిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు
- అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
- తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యేక గుర్తింపు: ఎమ్మెల్యే మల్లారెడ్డి
- అంబరాన్నంటి బోనాల సంబురం
- ముషీరాబాద్, అంబర్‌పేట ఆలయాల్లో ఎమ్మెల్యేలు కేటీఆర్, తలసాని, ముఠా గోపాల్ పూజలు
- చిత్తారమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు పూజలు
అంబర్‌పేట, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా అంబర్పేట్లోని ప్రసిద్ధ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతిని భ విష్యత్ తరాలకు అందించేలా ప్రతి ఒక్క రూ వాటిని కొనసాగించాలని ఆయన అన్నారు.
ప్రజలు సుభిక్షంగా ఉండాలి
జవహర్‌నగర్, ఆగస్టు 9 (విజయక్రాం తి): అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఎమ్మెల్యే మల్లా రెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి జవహర్‌నగర్ పరిధిలోని దేవేందర్ నగర్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మే యర్ మేకల కావ్యతో కలిసి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడు తూ.. తెలంగాణలో బోనాల పండుగకు ప్ర త్యేక గుర్తింపు ఉందని, ఇది మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
ప్రజలతో బీఆర్‌ఎస్కు ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నా రు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల ముదిరాజ్, ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భార్గవ్ రామ్, మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్, రవి, సిద్దుల యాదవ్, సతీష్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముషీరాబాద్, అంబర్‌పేటలో..
ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ముషీరాబాద్, అంబర్పేట నియోజకవర్గాలలో ఆయా ఆలయాల నిర్వాహకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కవాడిగూడ డివిజన్లోని లోయర్ ట్యాంక్ బండ్లో గల శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ పట్టువస్త్రాలు సమర్పించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాద వ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పూజలు చేశారు. బోనాల ఉత్సవాల నిర్వాహకులు పెద్ద ఎత్తున ఫలహార బండ్ల ఊరేగింపును నిర్వహించారు.
మాజీ కార్పొరేటర్ ప్రత్యేక పూజలు
గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ డివిజన్లోని వివిధ అమ్మవారి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, చంటి, తదితరులు పాల్గొన్నారు.
చిత్తారమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు పూజలు
కూకట్‌పల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి): కూకట్‌పల్లి చిత్తారమ్మ ఆలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు బోనం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాల న్నారు. కేసిఆర్, కేటీఆర్ లు బోనాల పండు గ సంప్రదాయన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మాధవరం రంగారావు, రోజా రంగారావు తదితరులు పాల్గొన్నారు.
మేడిపల్లి, పీర్జాదిగూడలో..
మేడిపల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి): మేడిపల్లి, పీర్జాదిగూడలోని ఆలయాలలో బోనాలు పండుగను వైభవంగా నిర్వహించా రు. మైసమ్మ, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఆలయాలను అలంకరించి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తిన బోనాలను ఎత్తుకొని ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాలతో ఆ లయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
పలు ఆలయాల్లో కోట నీలిమ పూజలు..
సికింద్రాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): నగరంలోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాలను సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ సందర్శించి పూజలు నిర్వహించారు. బేగంపేట్ డివిజన్లోని ఊర ముత్యాలమ్మ, పోచమ్మతల్లి, నల్లపోచమ్మ ఆలయాలు, అమీర్పేట్ డివిజన్లోని కనకదుర్గ ఆలయం, సనత్నగర్ డివిజన్లోని సెవెన్ టెంపుల్స్, జెక్ కాలనీలోని నల్లపోచమ్మ ఆలయం, మూసాపేట్లోని చిత్తారమ్మ ఆలయం, లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారిని ,
అక్కన్న మాదన్న దేవస్థానాన్ని దర్శించిపూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు నీలిమకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ కాలనీలో..
కుత్బుల్లాపూర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీలో బోనాల వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బోనాల వేడుకల సందర్బంగా జర్నలిస్ట్ కాలనీ లోని శ్రీ చర్ల ఎల్లమ్మ దేవి ఆలయానికి మహిళలు భారీ ఎత్తున వెళ్లి బోనాల మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నిజాంపేట్ లోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయం లో బోనాలు సమర్పించారు.






