డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
రూ.2కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన
బడంగ్‌పేట్, జూలై 4 (విజయక్రాంతి ): నాదర్గుల్ 57వ డివిజన్ అల్మాస్గూడ ప్రాం తంలోని స్వేచ్ఛా నివాస్, వినాయక్ హిల్స్ పరిసర కాలనీల్లో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రూ. 2 కోట్ల నిధులతో చెరువులోకి డ్రైనేజీ అవుట్లెట్ ఏర్పాటు చేసే పనులకు మ హేశ్వరం ఎమ్మెల్యే, సబితా ఇంద్రారెడ్డి శం కుస్థాపన చేశారు. మరో రెండు పనుల కో సం కూడా త్వరలోనే తలా రూ. 2 కోట్ల చొ ప్పున నిధులు మంజూరు కానున్నాయని ఆ మె వెల్లడించారు.
ఈ పనులు పూర్తయితే వ ర్షాకాలంలో నీరు నిల్వ ఉండే సమస్య తొలగిపోతుంది. వినాయక్ హిల్స్ ఫేజ్-2లో సబ్ రోడ్ల నిర్మాణం సహా మిగిలిన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని ఎ మ్మెల్యే హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలుండాలని, అభివృద్ధి విష యంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కాలనీవాసులకు విజ్ఞప్తి చేశారు.
ప్రభు త్వం చెరువుల పరిరక్షణ, నిర్వహణలో నిర్ల క్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. గతంలో తాము బ్యూటిఫికేషన్ చేసిన చెరువులు, వాకింగ్ ట్రాక్లు, లైటింగ్లను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పష్టమైన విజన్తో చెరువులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శేఖర్ రెడ్డి, సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, కృష్ణ, సరిత రెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు.






