5 July, 2026 | 2:25 AM

ఇబ్బంది లేకుండా ‘సర్’ నిర్వహించాలి

05-07-2026 12:00 AM

మేడ్చల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి రాగిడి లక్ష్మా రెడ్డి

మేడిపల్లి, జూలై 4 (విజయక్రాంతి): ప్రజలకు ఇబ్బందులు లేకుండా సర్ ప్రక్రియ నిర్వహించాలి అని మేడ్చల్ నియోజకవర్గ బి ఆర్‌ఎస్ ఇన్చార్జి రాగిరి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో కొనసాగు తున్న ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవర ణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పీర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్, చెంగిచర్ల డివిజన్లలోని పలు పోలింగ్ బూత్లను మాజీ మేయర్లు వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డి, బోడుప్పల్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బిఎల్‌ఎలతో కలిసి స మీక్షించారు.

ఈ సందర్భంగా పలు వురు ఓ టర్లు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించగా, వాటిని వెంటనే బోడుప్పల్ డి ప్యూటీ కమిషనర్ శైలజ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సహాయక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచా లని అధికారులను కోరారు.

డిప్యూటీ కమిషనర్ శైలజ సానుకూలంగా స్పందిస్తూ, ప్రజ లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు హరిశంకర్ రెడ్డి, మహేష్, మధుసూదన్ రెడ్డి, నాయకులు మధుకర్, శ్యామల శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు ప్రభు, రవి గౌడ్, కృష్ణ, చక్రపాణి గౌడ్, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.