calender_icon.png 22 January, 2026 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

03-10-2024 01:24:07 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 2: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకా రం.. పుస్నాపల్లి జానకీరామ్ (45), సుజాత భార్యాభర్తలు. వీరు నాగోల్‌లోని కృషి నగర్‌లో నివాసం ఉంటు న్నారు. కాగా, కాచిగూడలో ఉంటున్న అత్తగారింట్లో పండుగ ఉండడంతో సుజాత మంగళవారం అక్కడకు వెళ్లింది.

అయితే, అదేరోజు రాత్రి భార్య సుజాతకు జానకీరామ్ ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. కంగారు పడిన భార్య సుజాత వెంటనే ఇంటి ఓనర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఇంటి ఓనర్ వెళ్లి చూసేసరికి జానకీరామ్ ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడ్డు. ఆర్థిక ఇబ్బందులతోనే జానకీరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఫిర్యాదు చేయడంతో నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.