03-10-2024 01:24:48 AM
కూకట్‌పల్లి, అక్టోబర్ 2: గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కూకట్‌పల్లిలోని లోధ అపార్ట్‌మెంట్స్ సమీపంలో ఉన్న ఉదాసీన మఠానికి చెందిన నిర్మానుష్య స్థలంలో ఓ గుర్తు తెలియని మహిళ (30) మృతదేహం పడి ఉన్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదే హాన్ని పరిశీలించి నాలుగు రోజుల క్రితం హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. మృతురాలి చేతిపై లక్కీ అని పచ్చబొట్టు ఉందని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.