19 August, 2026 | 2:35 AM

పట్టుదలతో చదివితే పోలీసు ఉద్యోగం

19-08-2026 12:51 AM

సీఐ గడ్డం మల్లేష్ 

కామారెడ్డి, ఆగస్టు 18 (విజయక్రాంతి): పట్టుదలతో నిరుద్యోగులు చదివితే పోలీసు ఉద్యోగం రాష్ట్ర పోలీస్ శాఖ నార్కటిక్ విభాగం సిఐ గడ్డం మల్లేష్ చెప్పారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిరుద్యోగులతో పోలీసు ఉద్యోగులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లేష్ తాను స్థానికుడిని ఎంతో పట్టుదలతో చదివి పోలీసు ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. తన అనుభవాలను వివరించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు జనరల్ నాలెడ్జి పై అవగాహన పెంచుకోవాలి అన్నారు.