19 August, 2026 | 2:01 AM

విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి

19-08-2026 12:49 AM

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి 

తాడ్వాయి, ఆగష్టు 18 (విజయక్రాంతి): విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో మంగళవారం ఆయన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డెస్కులు, ఆండ్రాయిడ్ టీవీని విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులను అన్ని విధాలుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు తాను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, విహెచ్పి నేత పగడాకుల బాలస్వామి, హైమారెడ్డి,కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు, ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.