13-12-2025 12:20:33 AM
ధర్మపురి,డిసెంబర్12 (విజయక్రాంతి): 2వసాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వుల మేరకు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సూచనలతో ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. నేరేళ్ల, రాయపట్నం, వెల్గటూర్ గ్రామాలలో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు.
అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కునీ ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఎన్నికల నిబంధనలను అందరూ విధిగా పాటించాలనీ ఆయన సూచించారు.ఈ కార్యక్రమం లో ఎస్త్స్రలు మహేష్, ఉదయ్ కుమార్, కృష్ణసాగర్ రెడ్డి, సతీష్ , రవీందర్ కుమార్ మరియు కానిస్టేబుల్స్‌పాల్గొన్నారు.