13-12-2025 12:19:02 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి :డిసెంబర్12 (విజయ క్రాంతి): గ్రామాల అభివృద్ధి చేసే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకే పట్టం కట్టాలని చొప్పదండి ఎమ్మెల్యే మే డిపల్లి సత్యం కోరారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తడ గొండ,కోరేం, దేశాయిపల్లి గ్రామాలతోపాటు మ రో కొని గ్రామాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కోరెం గ్రామపంచాయతీకి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి జవ్వాజి విజయలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నియోజకవర్గంలో తాను అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. కోరెం గ్రామానికి గతంలో ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పనిచేసిన అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని అన్నారు. అందుకు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు పట్టం కడితే గ్రామాలు మరింత అభివృద్ధి అవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, సర్పంచ్ అభ్యర్థి జవ్వాది విజయలక్ష్మి ధనుంజయ్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.