13-12-2025 12:25:10 AM
కాజీపేట (మహబూబాబాద్) డిసెంబర్ 12 (విజయక్రాంతి): ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాన్ని నడిపి 103 పెం డింగ్ చలాన్లు వున్న వాహనాన్ని కాజీపేట ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. శుక్రవారం కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న ఆధ్వర్యంలో ఎ స్త్స్రలు కనక చంద్రం, సంపత్ సిబ్బంది కాజీపేట చర్చి వద్ద వాహన తనిఖీలు నిర్వ హించారు.
ఈ సందర్భంగా ఓ బైక్ పై 103 పెండింగ్ చలాన్లు వున్న వాహనాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. రూ. 25,105 రూపాయల చలాన్లు ఉండగా సదరు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.