02-08-2025 01:12:40 AM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి: ఆగస్టు 1(విజయక్రాంతి ) పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధిత కు టుంబాలకు ఆర్థిక సాయం అందించి వెన్నుదన్నుగా నిలుస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. శుక్రవారం బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన గ్రామపంచాయతీ సిబ్బంది కొత్తకొండ మల్లేశం మృతిచెందగా వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు రెండు రోజుల్లోనే 50వేల ఆర్థిక సాయం చెక్కును అందించారు.
ఈ సందర్భంగా బయట కుటుంబం ఎమ్మెల్యే సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మల్కాపూర్ గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో బీమ జయశీల, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి ఏఎంసి చైర్మన్ ఎల్లేష్ కాంగ్రెస్ నాయకులుఉన్నారు.