calender_icon.png 2 August, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

02-08-2025 08:35:48 AM

హైదరాబాద్: కూకట్ పల్లి(Kukatpally) పరిధిలోని బాలజీనగర్ లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనాల మెకానిక్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణంలోని బ్యాటరీలు, మూడు ద్విచక్రవాహనాలు దగ్దం అయ్యాయి. మంటలు గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దుకాణంలో మంటలను అదుపుచేశారు.