calender_icon.png 2 August, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండస్ట్రీలో మరో విషాదం.. హోటల్‌లో శవమై కనిపించిన కళాభవన్‌

02-08-2025 10:31:29 AM

కొచ్చి: మలయాళ సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్(Malayalam Actor Kalabhavan Navas) కొచ్చి చొట్టనిక్కరలోని ఒక హోటల్‌లో మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నవాస్ (51) సినిమా షూటింగ్ కోసం బస చేసిన హోటల్ సిబ్బంది అధికారులకు సమాచారం అందించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు పేర్కొన్నారు. అతనికి గుండెపోటు వచ్చి ఉంటుందన పోలీసులు అనుమానిస్తున్నారు.  కళాభవన్ మరణానికి గల కారణాన్ని నిర్ధారించడానికి శనివారం కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. క

ళాభవన్ మృతదేహాన్ని చొట్టనిక్కరలోని ఎస్ డీ టాటా ఆసుపత్రిలో ఉంచారు. మలయాళ సినిమా ప్రకంభం షూటింగ్‌లో భాగంగా కళాభవన్ హోటల్‌లో బస చేశారు. శుక్రవారం సాయంత్రం, నటుడు తన గది నుండి బయటకు వెళ్లాల్సి ఉంది. అయితే, చెక్-అవుట్ కోసం రిసెప్షన్‌కు రాకపోవడంతో, హోటల్ సిబ్బంది అతని గదిలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల ప్రకారం, అతని గదిలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కళాభవన్, మలయాళ సినిమాలో మిమిక్రీ కళాకారుడిగా, నేపథ్య గాయకుడిగా, నటుడిగా విస్తృత ప్రశంసలు పొందారు. 1995లో చైతన్యం అనే చలనచిత్రంలో నటుడిగా ఆయన అరంగేట్రం చేశారు. అతను మిమిక్స్ యాక్షన్ 500 (1995), హిట్లర్ బ్రదర్స్ (1997), జూనియర్ మాండ్రేక్ (1997), మట్టుపెట్టి మచాన్, అమ్మ అమ్మయ్యమ్మ (1998), చందమామ (1999), థిల్లానా తిల్లానా (2003) వంటి అనేక చలనచిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో నటించాడు. కళాభవన్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మృతికి సంతాపం తెలిపారు.