02-08-2025 09:12:55 AM
హైదరాబాద్: సికింద్రాబాద్(Secunderabad)లో ఆవులను కార్లలో అపహరిస్తున్న ముఠాపై కేసు నమోదైంది. గత నెల 27న మోండా మార్కెట్ పరిధి బండిమెట్ లో ఆవులు(cow theft) అపహరణకు గురయ్యాయి. ఆవుల అపహరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆవులకు మత్తు ఇంజెక్షన్(Anesthesia injection) ఇస్తున్న దొంగల ముఠా కార్లలో అపహరిస్తున్నారు. నిన్న మారేడ్ పల్లిలోనూ(Marredpally) ఆవుల అపహరణపై స్థానికులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో ఆవుల ఆపహరణ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.