02-08-2025 10:34:49 AM
నాగార్జునసాగర్: విజయక్రాంతి: కృష్ణమ్మ జల కళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరద నీరు పోటెత్తడంతో కళకళలాడుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి కంటిన్యూగా వరద వస్తుండటంతో శనివారంసాగర్ డ్యాం 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ అందాలను చూసేందుకు సందర్శకులు భారీగా వస్తున్నారు. నాగార్జునసాగర్(Nagarjunasagar) ప్రాజెక్టు వద్ద 5 వ రోజు కృష్ణమ్మ జలసవ్వడి కొనసాగుతుంది.ఎగువ కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ఉన్న ప్రాజెక్టులన్ని నిండుకుండల మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు.
దీనితో ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు నుండి 2,57,342 క్యూస్సేక్కుల నీటిని దిగువన ఉన్న సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు 24 గేట్లను 5 అడుగులు 2 గేట్లను 10 అడుగులు మొత్తం 26 క్రష్ట్ గేట్లను ఎత్తి 2,57,342 క్యూస్సేక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.దీనితో సాగర్ జలాశయ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.20 పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 298.0120 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 28,988 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 7684 క్యూస్సేక్కుల నీటిని,కుడికాల్వకు 8604 క్యూస్సేక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూస్సేక్కులు .వరద కాల్వద్వారా 300 క్యూస్సేక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 2,57,342 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పర్యాటకుల సందడి
సహజ సుందర జలదృశ్యాన్ని చూడడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్ల సుందర దృశ్యాలు నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగడంతో ఆ జలదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో డ్యాం పరిసరాలు పర్యాటకులతో సందడిగా మారాయి. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం సమీపం, కొత్త వంతెన, లాంచీస్టేషన్ జనంతో కిటకిటలాడాయి. నదిలో లాంచీ జాలీ ట్రిప్పు, వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి కనబర్చారు.