02-08-2025 11:18:33 AM
గేటు ముందు విద్యార్థుల పడిగాపులు.
భూ వివాదమే కారణం.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా బొందలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు(Government School) తాళం వేయడంతో విద్యార్థులు లోనికి వెళ్లలేక గేటు ముందు పడిగాపులు కాసారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వేలితే పాఠశాల మరింత విస్తరిస్తూ పుణంనిర్మాణం కోసం గ్రామంలోని కొందరు భూమి దానం చేశారు. కాగా మరికొంత ఎక్కువ స్థలంలో పాఠశాల నిర్మాణం చేపట్టారని సదురు బాధితుడు కోర్టు మెట్లు ఎక్కగా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ కొంత హంగామా చేస్తూ శుక్రవారం సాయంత్రం టీచర్స్, విద్యార్థులను బయటికి పంపి తాళం వేసే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులు అతనితో వారించడంతో అప్పటికి సద్దు మణిగింది. కానీ శనివారం ఉదయం విద్యార్థులు వచ్చేసరికే పాఠశాల తాళం వేసి కనిపించడంతో టీచర్స్, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుకున్న ఎంఈఓ భాస్కర్ రెడ్డి చట్ట ప్రకారమే అనుసరించాలని సూచించడంతో తాళం తీసినట్లు తెలిపారు.