02-08-2025 10:40:04 AM
బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్
దేవరకొండ: క్రీడలలో రాష్ట్ర స్థాయిలో రాణించి దేవరకొండ నియోజకవర్గాన్ని(Devarakonda constituency) మంచి గుర్తింపు తీసుకురావాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తనయుడు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 20116,రెండవ బహుమతి 15116,మూడవ బహుమతి, 10116 బహుమతులను బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో షేక్ ఇస్మాయిల్, లాలయ్య, గిరి, జహంగీర్,శంకర్,చింటూ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు