calender_icon.png 2 August, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రానైట్ క్వారీలో ప్రమాదం: ఒకరు మృతి

02-08-2025 01:13:53 AM

హుజురాబాద్,ఆగస్టు01: (విజయక్రాంతి) కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని జాగిరిపల్లి శివారులోని గ్రానైట్ క్వారీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో రాజు (43) అనే వ్యక్తి మృతి చెందారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామానికి చెందిన రాజు బతుకు తెరువు కోసం రెండు సంవత్సరాల క్రితం క్వారీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

జెసిబి తో రాళ్లు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు రాజు తలపై పడడంతో తీవ్ర గాయాలయి అక్కడక్కడ మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్త్స్ర తిరుపతి చేరుకొని మృతదేహాన్ని నిమిత్తం హుజురాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య సంతోష్ కుమారి ఫిర్యాదు మేరకు కేస నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులుతెలిపారు.