16 July, 2026 | 9:57 AM

కోహ్లీకి అరుదైన గౌరవం..

19-04-2024 12:18 AM

న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఏప్రిల్ 18.. ప్రపంచ వారసత్వ సంపద దినోత్సవం సందర్భంగా జైపూర్‌లోని వాక్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 35 కేజీల బరువున్న మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు దాదాపు రెండు నెలలు పట్టిందంటూ మ్యూజియం డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఏడాదిగా మ్యూజియానికి వస్తున్న పర్యాటకులు కోహ్లి మైనపు విగ్రహాన్ని పెట్టాలంటూ డిమాండ్ చేయడంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా ఈ మ్యూజియంలో ఇప్పటికే 44 మైనపు విగ్రహాలను ఏర్పాటు చేయగా.. వారిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని ఉన్నారు. తాజాగా వీరి సరసన కోహ్లి చేరాడు.