వినేశ్ పైనే ఆశలు..
19-04-2024 12:17 AM
బిష్కెక్ (కిర్గిస్థాన్): పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సంపాదించడమే లక్ష్యంగా భారత రెజ్లర్లు సమాయత్తమవుతున్నారు. శుక్రవారం నుంచి కిర్గిస్థాన్ వేదికగా జరగనున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ నుంచి 16 మంది రెజ్లర్లు పోటీపడుతున్నారు. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పైనే అందరి దృష్టి ఉంది. మొత్తం 36 కోటాలకు గానూ 18 వెయిట్ కేటగిరీల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ పంగల్ పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకుంది.






