మహీ భాయ్‌ని ఒప్పించడం కష్టం..
19-04-2024 12:21 AM
ఇక మహీ భాయ్ (ఎంఎస్ ధోని)ని టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్‌కు వచ్చేలా ఒప్పించడం కష్టమని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న ధోని మ్యాచ్‌లు ఆడి అలసిపోతాడు. టీ20 ప్రపంచకప్ కోసం ధోనిని విండీస్ కు రప్పించలేమని.. అయితే గోల్ఫ్ ఆడేందుకు అతను అమెరికా వచ్చే అవకాశాలున్నాయన్నాడు. ఇక 2021 టి20 ప్రపంచకప్ సమయంలో ధోని భారత జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రోహిత్ ఇంకా మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో అమలు చేస్తోన్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. ఇంపాక్ట్ నిబంధన వల్ల వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే లాంటి ఆల్‌రౌండర్లు బౌలింగ్ చేయలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు.






