10 May, 2026 | 8:16 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మరిపెడ విద్యార్థికి అరుదైన అవకాశం

30-07-2025 12:16 AM

‘సీపీఎల్‌ఆర్‌ఐ’లో ఒక రోజు శాస్త్రవేత్తగా అవకాశం

మహబూబాబాద్, జూలై 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ తెలంగాణ మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న పనుగోతు ప్రేమ్‌చంద్ చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిఎల్‌ఆర్‌ఐ)లో జరిగిన ప్రతిష్టాత్మకమైన ‘ఒక రోజు శాస్త్రవేత్త’ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ నెల 25న నిర్వహించిన కార్యక్రమంలో ప్రేమ్‌చంద్ పాల్గొన్నాడు.

దేశవ్యా ప్తంగా వివిధ ప్రాంతాల నుం చి వచ్చిన శాస్త్రవేత్తలు, ఇతర విద్యార్థులు సైన్స్ పట్ల అంకితభావం, ఉత్సాహం నుంచి ప్రేరణ పొందే విధంగా తనకు ఈ కార్యక్ర మం దోహద పడిందని ప్రేమ్‌చంద్ చెప్పారు. సదస్సులో పాల్గొనడానికి మహమ్మద్ అక్తర్, అధ్యాపకులు ప్రోత్సాహం అందించారని పేర్కొన్నాడు.